స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడెప్పుడొస్తుందా అని అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇదిగో, అదిగో అంటూ బన్నీ వెనకాడేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా అనీ, హారిక హాసినీ బ్యానర్‌తో కలిసి, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడనీ మాత్రం అధికారిక క్లారిటీ ఉంది ఈ సినమాకి.
హీరోయిన్ విషయంలోనూ ఊగిసలాట అలాగే ఉంది. కియారా అద్వానీ అనీ, పూజాహెగ్డే అనీ ప్రచారం జరుగుతోంది. ఫైనల్ కాలేదింకా. ఇదిలా ఉంటే, ఈ సినిమా హాలీవుడ్ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కబోతోందనీ తాజా సమాచారమ్. 'ఇన్‌వెన్షన్ ఆఫ్ లైయింగ్' అనే హాలీవుడ్ మూవీ కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాకి స్క్రిప్టు సిద్ధం చేశాడట త్రివిక్రమ్. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా, బన్నీ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యేలా, తనదైన పంచ్ డైలాగ్‌ల శైలిలో కథ సిద్ధం చేశాడనీ తెలుస్తోంది.
ఈ సినిమాకి 'నాన్న - నేను' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. టైటిల్‌లో పోజిటివ్ వైబ్ బాగానే ఉంది. త్రివిక్రమ్ - బన్నీ కాంబోకీ పోజిటివ్ సెన్స్ తోడైంది. ఆల్రెడీ రెండు హిట్లు కొట్టిన ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టాలనే కసి మీదున్నట్లు తెలుస్తోంది. సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, బీభత్సమైన యాక్షన్ కూడా ఈ సినిమాలో ఉండబోతోందనీ తాజా సమాచారమ్. అయితే ఇవన్నీ అఫీషియల్ అని తేలాలంటే మాత్రం ఇన్ని రోజులూ ఎదురు చూసినట్లే మరి కొంతకాలం ఎదురు చూడక తప్పదు బాస్.!