గ్లామ్‌షాట్‌: రంగు రంగుల అందాల చేప పిల్ల.!

By iQlikMovies - February 08, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

'1 - నేనొక్కడినే' చిత్రంలో మహేష్‌ పక్కన తళుక్కున మెరిసింది పొడుగు కాళ్ల సుందరి కృతిసనన్‌. తర్వాత నాగచైతన్యతో 'దోచేయ్‌' మూవీతో కుర్రకారు మనసుల్ని దోచేసింది కానీ, హిట్‌ మాత్రం దక్కించుకోలేకపోయింది. రెండు సినిమాలూ ఆశించినం రిజల్ట్‌ అందుకోకపోవడంతో ఏముంది టాలీవుడ్‌లో దుకాణం కట్టేసి, బాలీవుడ్‌లో పాగా వేసింది. అక్కడ కూడా అంతంత మాత్రమే.

 

ఏవో కొన్ని సినిమాల్లో నటించింది కానీ, చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించలేదక్కడ కూడా. ఇక నెట్టింట్లో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుందీ భామ. అంగాంగ ప్రదర్శన చేయడానికి అమ్మడికేమీ అభ్యంతరాల్లేవు. అప్పుడప్పుడూ హాట్‌ హాట్‌ పిక్స్‌తో తెలుగు ప్రేక్షకులకు తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటూ ఉంటుంది. అలా తాజాగా కృతిసనన్‌ పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ నెట్టింట్లో వైరల్‌ అయ్యిందిప్పుడు. పంచరంగుల లెహెంగాతో గోల్డెన్‌ కలర్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌లో కుర్రకారు మతి పొగొట్టేస్తోందిలా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now