'చిత్రలహరి' పూర్తయిపోయిందోచ్‌.!

By Inkmantra - March 15, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ తాజాగా 'చిత్రలహరి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లేటెస్ట్‌గా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ సరదాగా దిగిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 'నేను శైలజ', 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలతో ఆకట్టుకున్న కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. కాగా ఇటీవల విడుదలైన 'చిత్రలహరి' టీజర్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంది. 

 

వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న సాయి ధరమ్‌ తేజ్‌కి ఈ సినిమాతో హిట్‌ దక్కేలానే ఉంది. టీజర్‌ వచ్చాక సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవుతుందని అర్ధమైంది. హీరోయిన్లు కళ్యాణీ ప్రియదర్శిన్‌, నివేదా పేతురాజ్‌కి మంచి పాత్రలు దక్కాయి ఈ సినిమాలో. కామెడీతో పాటు, పర్‌ఫామెన్స్‌కీ స్కోపున్న పాత్రలవి. టీజర్‌లో ఆ విషయం ఆల్రెడీ అర్ధమైంది. 

 

అందంగా కనిపిస్తూనే పర్‌ఫామెన్స్‌తోనూ ఆకట్టుకోనున్నారు వీరిద్దిరు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయిపోయిందని తాజాగా చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ఇక నెక్ట్స్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ కానుంది. ఈ సమ్మర్‌కే 'చిత్రలహరి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS