తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నుండి 'అవసరం..' అనే వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. లక్ష్మీపార్వతి యాంగిల్ నుండి తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్‌గా ఈ చిత్రాన్ని వర్మ రూపొందించిన సంగతి తెలిసిందే. అందుకే మొట్ట మొదటి వుమెన్ ఓరియెంటెడ్ మెన్స్ ఫిలింగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని అభివర్ణించారు రామ్‌గోపాల్ వర్మ. హ్యాపీ వుమెన్స్ డే చెబుతూ ఈ సాంగ్ ప్రోమోని విడుదల చేశారాయన. విడుదలైన మొదటి గంటలోనే ఈ సాంగ్ లక్ష వ్యూస్‌ని క్రాస్ చేసింది.
ఈ సాంగ్ లిరిక్స్‌లో ఎన్టీఆర్ ఆవేదన సుస్పష్టంగా కనిపిస్తోంది. లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సాంగ్‌కి సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ పోస్ట్‌లు పోటెత్తుతున్నాయి.
వర్మ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం అని కొందరు అంటుంటే, కాదు కాదు, వైఎస్సార్ సీపీకి వర్మ అవసరం ఎంతో ఉందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రముఖ పాటల రచయిత సిరాశ్రీ ఈ పాటను రచించగా, కళ్యాణీ మాలిక్ సంగీతమందించారు. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ట్రైలర్‌తో క్రియేట్ అయిన ఇంట్రెస్ట్‌తో సినిమాపై సర్వత్రా ఆశక్తి నెలకొంది.