ఫ్లాపులొచ్చినా క్రేజు త‌గ్గ‌లేదే...?!

By Gowthami - March 18, 2019 - 15:09 PM IST

మరిన్ని వార్తలు

పాపం.. సాయిధ‌ర‌మ్ తేజ్‌. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌య్యాడు. ఒక‌టా రెండా..? ఏకంగా అర‌డ‌జ‌ను ఫ్లాపులు. తిక్క‌, విన్న‌ర్‌, జ‌వాన్, న‌క్ష‌త్రం, తేజ్ ఐ ల‌వ్ యూ, ఇంటిలిజెంట్‌.. ఇలా ఫ్లాపుల‌న్నీ ప‌గ‌బ‌ట్టాయి. ఇన్ని ప‌రాజ‌యాల త‌ర‌వాత ఓ సినిమా వ‌స్తోందంటే క‌చ్చితంగా ఏమాత్రం క్రేజ్ ఉండ‌దు. బిజినెస్ కూడా సాగ‌దు. కానీ... 'చిత్ర‌ల‌హ‌రి' మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా బిజినెస్ హాట్ కేకులా అయిపోయింది. 

 

ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ అమ్ముడుపోయింది. దాదాపు 26 కోట్ల బిజినెస్ పూర్తి చేసుకుంది.  ఆంధ్రా, నైజాం, సీడెడ్ క‌లిపి రూ.10 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చాయ‌ట‌. డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ కింద మ‌రో 12 కోట్లు వ‌చ్చాయి. రెస్టాఫ్ ఇండియా, ఓవ‌ర్సీస్ కలిపి 4 కోట్లు వ‌చ్చాయి. మైత్రీ మూవీస్ తెర‌కెక్కించిన సినిమా ఇది. ఆ సంస్థ‌పై బ‌య్య‌ర్ల‌కు ఉన్న న‌మ్మ‌కంతోనే ఈ స్థాయిలో బిజినెస్ జ‌రిగింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన చిత్ర‌ల‌హ‌రి టీజ‌ర్‌ కూడా ప్రామిసింగ్‌గానే ఉంది. దాంతో... ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS