'మహర్షి' రిలీజ్‌పై అనుమానాలు: నిజమా.? కాదా.?

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సినిమాల విడుదలపై ఎందుకో తెలీదు, ఎప్పుడూ ఇలాంటి గాసిప్సే వస్తుంటాయి. అయితే 'మహర్షి' విడుదలపై ఆ గాసిప్స్‌ ఇంకాస్త ఎక్కువయ్యాయని చెప్పాలి. నిర్మాణ సంస్థ రిలీజ్‌ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసినా, అనుకున్న టైంకే మేం రిలీజ్‌ చేస్తాం మొర్రో అని మొత్తుకున్నా.. ఎందుకో అనుమానాలు తీరడం లేదు. గాసిప్స్‌ ఆగడం లేదు. 

 

తాజాగా మే లో 'మహర్షి' విడుదలవుతుందట అనే గాసిప్‌ ప్రచారంలోకి వచ్చింది. ఏప్రిల్‌ 25న 'మహర్షి' రిలీజ్‌కి డేట్‌ ఫిక్స్‌ చేశారు. కానీ ఇంకొక్క వారం రోజులు విడుదల డేట్‌ని పోస్ట్‌ పోన్‌ చేశారనీ తెలుస్తోంది. టెక్నికల్‌ కారణాలు కొన్ని అయితే, మే నెల అన్ని రకాలా అనుకూలంగా ఉంటుందనీ, ముఖ్యంగా ఎగ్జామ్స్‌ సీజన్‌ క్లోజ్‌ అయిపోయి, హాలీడేస్‌ సీజన్‌ ఫుల్‌గా వర్కవుటవుతుందనీ భావిస్తున్నారట. 

 

అయితే ఈ గాసిప్‌లో నిజమెంతో తెలీదు కానీ, తాజా గాసిప్‌తో మహేష్‌ ఫ్యాన్స్‌లో మళ్లీ ఆందోళన నెలకొంది. మరోవైపు 'మహర్షి' తర్వాత సుకుమార్‌తో సినిమా ఉండబోతుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. సుకుమార్‌తో సినిమా లేదని మహేష్‌ స్వయంగా కన్‌ఫామ్‌ చేసేశారు. అనిల్‌ రావిపూడితో సినిమాకి స్క్రిప్టు కష్టాల్లో పడిందనీ తెలుస్తోంది. రెండు సినిమాలతో ఒక్కసారిగా జోరు పెంచాడనుకున్న సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ని మళ్లీ మళ్లీ ఇలా నిరాశపరుస్తున్నాడెందుకో.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS