మహేష్ బాబుని కాదని అల్లు అర్జున్ కాంపౌండ్‌లోకి అడుగు పెట్టాడు సుకుమార్. కాంబినేషన్‌లు చివరి నిమిషంలో చేతులు మారడం, ఒకరి కోసం అనుకున్న స్క్రిప్టు మరో హీరో చేయడం చిత్రసీమలో మామూలే. కాకపోతే... మహేష్ బాబు - సుకుమార్ విషయంలో జరిగిన కథే వేరన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
మహేష్ బాబుతో ఓ సినిమా చేయాల్సిన సుకుమార్ చివరి నిమిషంలో యూటర్న్ తీసుకుని అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లాడు. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందన్న అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మహేష్ బాబు కూడా సుకుమార్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశాడు. నిజానికి.. మహేష్ సుకుమార్ వ్యవహార శైలి చూసి హర్ట్ అయ్యాడని సమాచారం.
సుకుమార్ తనతో కాకుండా మరో హీరోతో సినిమా చేస్తున్నాడన్న సంగతి మహేష్‌కి కూడా తెలీదట. 'నేను మీతో పనిచేయలేను... మరో హీరోని చూసుకుంటాను' అని సుకుమార్ మాట వరసకు కూడా చెప్పలేదని, బన్నీ ట్వీట్ వేసే వరకూ మహేష్ కీ ఈ విషయం తెలీదని సమాచారం. అయినా సరే హుందాగా ప్రవర్తించి, సుకుమార్‌కి ఆల్ ద బెస్ట్ చెబూతూ ట్వీట్ చేశాడు మహేష్. అయితే మహేష్‌కి సుకుమార్ హ్యాండ్ ఎందుకు ఇచ్చాడన్నది ప్రస్తుతం ఇండ్రస్ట్రీ వర్గాలలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది.