'ఉద్ఘర్ష': రెడ్‌ హాట్‌ రక్తపాతం.!

మరిన్ని వార్తలు

'కేజీఎఫ్‌' సినిమాతో కన్నడ సినిమా స్థాయి పెరిగింది. ఇతర సినీ పరిశ్రమల దృష్టిని విశేషంగా ఆకర్షించింది ఈ సినిమా. ఇదే జోష్‌తో మరో కన్నడ సినిమా రాబోతోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమానే 'ఉద్ఘర్ష'. ఓ పోస్టర్‌ ద్వారా ఈ సినిమా టైటిల్‌కి బాగానే పబ్లిసిటీ చేశారు. కానీ అదేంటో అర్ధం కాలేదు జనానికి. లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్‌తో సినిమాలో ఏముందో రివీల్‌ అయ్యింది. 

 

శ్రద్ధాదాస్‌, థాకూర్‌ అనూప్‌ సింగ్‌ సాయి, తాన్యా హోప్‌, సాయి ధన్సిక తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ నిండా యాక్షన్‌ సీన్లు, రక్తపాతాలు, ముద్దుగుమ్మల హాట్‌ హాట్‌ అందాలు, కసా కసా కత్తి పోట్లు, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలూ చాలా చాలా ఉన్నాయి. ఏదో చెప్పాలనుకున్నారు. ఎంతో చూపించాలనుకున్నారు ట్రైలర్‌లో. ఎంతో కొంత చెప్పగలిగారు. ఆశక్తి క్రియేట్‌ చేయగలిగారు. 

 

మనకు సుపరిచితులైన నటీనటులే ఎక్కువగా కనిపించడంతో ట్రైలర్‌పై ఆడియన్స్‌లో ఆశక్తి బాగానే క్రియేట్‌ అయ్యింది. ముఖ్యంగా శ్రద్ధాదాస్‌ హాట్‌గా కనిపించడంతో పాటు, చేతిలో కత్తితో కొంచెం ఘాటుగా కూడా కనిపిస్తోంది. ట్రైలర్‌ చివర్లో బెడ్‌పై ఒకర్ని కత్తితో కస కసా నరకడం ఒళ్లు గగుర్పొడుస్తోంది. మొత్తానికి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ట్రెండింగ్‌ నడుస్తోన్న ఈ తరుణంలో 'ఉద్ఘర్ష' ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటుందో చూడాలిక. సునీల్‌ కుమార్‌ దేశాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో త్వరలో విడుదల కానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS