మహేష్‌ - అనిల్‌ రావిపూడి.. 'మొదలైందిగా'.!

మరిన్ని వార్తలు

'ఎఫ్‌ 2' తర్వాత యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, మహేష్‌బాబుతో సినిమాకి కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే అనిల్‌తో సినిమాకి మహేష్‌ కమిట్‌ అయ్యాడు కానీ, అనిల్‌ మాత్రం అటూ ఇటూ ఊగుతూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు కన్‌ఫామ్‌ అయిపోయాడనీ తెలుస్తోంది. 'నా నెక్స్ట్‌ సినిమా పనులు స్టార్ట్‌ అయ్యాయి..' అని తాజాగా అనిల్‌ రావిపూడి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు 'మహర్షి' సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని మహేష్‌, అనిల్‌తో సినిమాకి రెడీగా ఉన్నారు. 

 

ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాగానే అనిల్‌ ఈ సినిమాని పట్టాలెక్కించేయనున్నాడనీ తెలుస్తోంది. అనిల్‌తో సినిమా తొందరగా కంప్లీట్‌ అవుతుందన్న కారణంతోనే మహేష్‌బాబు అనిల్‌తో సినిమాకి కమిట్‌ అయ్యాడు. సుకుమార్‌తో చేయాల్సిన సినిమాని కాన్సిల్‌ చేసుకుని మరీ అనిల్‌తో సినిమాని లైన్‌లో పెట్టిన మహేష్‌బాబు అతి త్వరలోనే ఈ సినిమాని కంప్లీట్‌ చేసే యోచనలో ఉన్నాడనీ అర్ధమవుతోంది. 

 

మేలో మహర్షి రిలీజ్‌ ఉన్న కారణంగా ఈ లోగానే కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించి కొన్ని షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేసి, 'మహర్షి' ప్రమోషన్స్‌లో పాల్గొననున్నాడని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. చూడాలి మరి మహేష్‌ జోరు చూస్తుంటే ఈ ఏడాది చివరికల్లా అనిల్‌ - మహేష్‌ కాంబో ప్రాజెక్ట్‌ ప్రేక్షకుల ముందుకొచ్చేలానే ఉంది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS