చిక్కుల్లో ప‌డ్డ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు

మరిన్ని వార్తలు

వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్‌లో ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న సంగీత ద‌ర్శ‌కుడు గోపీ సుంద‌ర్‌. త‌న ఖాతాలో భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, నిన్ను కోరి, ఊపిరి, మ‌జ్ను, గీతా గోవిందం లాంటి మంచి హిట్లున్నాయి. తాజాగా 'మ‌జిలీ'తోనూ ఓ విజ‌యం అందుకున్నారు. అయితే ఈ సినిమానే త‌న‌ని చిక్కుల్లో ప‌డేసింది. నాగ‌చైత‌న్య - స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం మ‌జిలీ. దీనికి గోపీ సుంద‌ర్ స్వరాలు స‌మ‌కూర్చిన సంగ‌తి తెలిసిందే. 

 

అయితే నేప‌థ్య సంగీతం మాత్రం త‌మ‌న్ ఇచ్చాడు. నిజానికి ఆర్‌.ఆర్ కూడా గోపీ సుంద‌ర్ చేయాల్సింది. చివ‌రి నిమిషంలో చేతులు ఎత్తేయ‌డంతో.... త‌మ‌న్ ని ఆశ్ర‌యించాల్సివ‌చ్చింది. ఈ సినిమాకి నేను ఆర్‌.ఆర్ చేయ‌లేను.. మ‌రొక‌రిని చూసుకోండి అని కూడా చెప్ప‌కుండా - సినిమాని ప‌క్క‌న పెట్టేశాడ‌ని, ఈ విష‌యంలో తాము చాలా మాన‌సిక క్షోభ‌కు గుర‌య్యామ‌న్న‌ది నిర్మాత‌ల వాద‌న‌.  

 

ముంద‌స్తు ఒప్పందం ప్ర‌కారం ఆర్‌.ఆర్ చేయ‌కుండా చివ‌ర్లో హ్యాండిచ్చిన గోపీ సుంద‌ర్‌పై ఫిర్యాదు చేయాల‌ని మ‌జిలీ నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఇందుకు సంబంధించి గోపీ సుంద‌ర్ పై ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో ఫిర్యాదు చేయాల‌ని అనుకుంటున్నారు. మ‌జిలీకి సంబంధించిన మొత్తం పారితోషికం గోపీకి ఇచ్చేశామ‌ని, ఆర్‌.ఆర్ చేయ‌నందు వ‌ల్ల పారితోషికంలో కొంత వెన‌క్కి ఇవ్వాల‌ని కూడా డిమాండ్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. గోపీ సుంద‌ర్ పోగ్రెస్ కార్డుపై ఇది ఓ మాయ‌ని మ‌చ్చే అనుకోవాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS