త్వరలో 'సూర్యకాంతం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది మెగా డాటర్ నిహారిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రెండు చిత్రాలతో అంతగా ఆకట్టుకోలేకపోయిన నిహారిక ఈ సినిమాతో స్పెషల్ సక్సెస్‌ని అందుకునేలా కనిపిస్తోంది. యూత్‌కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్‌తో వస్తోంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'సూర్యకాంతం' రూపొందింది.
ఇదిలా ఉంటే, తాజాగా నిహారిక ఓ స్పెషల్ ఫోటో షూట్‌తో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్ కాస్ట్యూమ్‌తో ప్రత్యేకంగా ఎట్రాక్ట్ చేస్తోంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఆమె గ్లామర్‌ని రెట్టింపు చేస్తోంది. గ్లామర్ పిక్ అని చెప్పలేం కానీ, మోడ్రన్ యూత్‌ఫుల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తోంది మెగా డాటర్ నిహారిక.
ALSO SEE : Niharika Konidela Latest Photoshoot