హ్యాకింగ్ బారిన పడ్డ నితిన్ హీరోయిన్

మరిన్ని వార్తలు

ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీల అకౌంట్స్ హ్యాక్ అవ్వటం హాట్ టాపిక్ గా మారుతుంది. మొన్న హన్సిక ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ఎవరో హాక్ చేసి తన ప్రైవేట్ ఫోటోస్ లీక్ చేసారు. ఇప్పుడు తాజాగా మరో తెలుగు హీరోయిన్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ భారిన పడింది. హీరో నితిన్ నటించిన 'లై' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ 'మేఘా ఆకాష్' ఆ తర్వాత 'చల్ మోహన్ రంగ' లో కూడా నటించింది.

 

ఈమె నటించిన రెండు సినిమాలూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ప్రేక్షకుల్లో మాత్రం పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. తాజాగా 'తన ఇన్ స్టాగ్రామ్ హాక్ అయ్యిందని, బ్యాకెండ్ టీం దానిపై వర్క్ చేస్తున్నారని, వీలైనంత త్వరలో సమస్యని పరిష్కరిస్తామని' మేఘా ఆకాష్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేసింది. 

 

దాదాపు 7 లక్షల వరకు ఫాలోయర్స్ ఉన్న తన అకౌంట్ ని ఎవరో హాక్ చేసి, రష్యా హాస్పిటల్ కి సంబంధించిన కాస్మోటిక్స్ పోస్టులు పెడుతున్నారట. అందులో కొన్ని అసభ్యకరమైన పోస్టులు కూడా ఉండడంతో అవి చూసి మేఘా ఫాన్స్ షాక్ అయ్యారంట. అందుకే, వెంటనే మేఘా ట్విట్టర్ ద్వారా తన అభిమానులందరికి అసలు విషయాన్ని తెలియజేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS