గ్లామ్‌షాట్‌: డార్క్‌ మెరూన్‌ 'అందమైన కుందనాల బొమ్మ'.!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌ని పోస్ట్‌ చేసే ముద్దుగుమ్మల్లో తమన్నా కాస్త వెనకబడే ఉందని చెప్పాలి. హీరోయిన్‌గా కెరీర్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే తమన్నా సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ కోసం స్పెషల్‌ ఫోటో షూట్స్‌ చేయించుకున్నది చాలా తక్కువే. తాజాగా మెరూన్‌ కలర్‌ బ్రైడల్‌ వేర్‌లో ఎట్రాక్టివ్‌గా సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చింది. 

 

అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరైన మిల్కీబ్యూటీ ఈ రకంగా ఎట్రాక్ట్‌ చేస్తూ ఫోటోలకు పోజిచ్చింది. ఈ పిక్‌కి బోలెడన్ని లైకులూ, రీ ట్వీట్లూ వచ్చి పడుతున్నాయి. హీరోయిన్‌గా టాప్‌ లెవల్‌ మెయింటైన్‌ చేస్తూనే, ఐటెంసాంగ్స్‌తోనూ మెప్పిస్తోన్న మిల్కీబ్యూటీకి గ్లామర్‌ ఏమంత కొత్త కాదు కానీ, సోషల్‌ మీడియా పబ్లిసిటీ మాత్రం చేయదంతే. 

 

ఇటీవల మిల్కీబ్యూటీ తమన్నా 'ఎఫ్‌ 2' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'సైరా', 'దటీజ్‌ మహాలక్ష్మి' సినిమాల్లో తమన్నా నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS