రిలీజ్‌కి సిద్ధమైన 'దేవి 2'.!

మరిన్ని వార్తలు

ఈ సమ్మర్‌కి సినిమాలు క్యూ కట్టాయి. స్టార్‌ హీరోలతో పాటు, యంగ్‌ హీరోలు కూడా ఒక్కొక్కరుగా రిలీజ్‌ డేట్స్‌ ఫిక్స్‌ చేసుకుంటున్నారు. ఆ కోవలో తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'దేవి 2' చిత్రం తాజాగా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది. గతంలో వచ్చిన 'దేవి' సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రూపొందించారు. మూడు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. 

 

తమిళంలో ప్రభుదేవా ప్రొడ్యూసర్‌ కాగా, హిందీలో సోనూసూద్‌ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో 'అభినేత్రి'గా విడుదలైంది. ఇక సీక్వెల్‌ విషయానికి వస్తే, మొదటి భాగంలో నటించిన ప్రధాన తారాగణం ఈ సినిమాలోనూ లీడ్‌ రోల్స్‌ పోషిస్తోంది. రిలీజ్‌ డేట్‌ని రివీల్‌ చేస్తూ విడుదలైన పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మొదటి భాగంలో తమన్నా ప్రెగ్నెంట్‌ అని తెలియడంతో సినిమా ఎండ్‌ చేస్తారు. 

 

ఇప్పుడు రెండో భాగంలో తమన్నా, ప్రభుదేవా జంటకు పుట్టబోయే బిడ్డ 'దేవి' అవుతుందా.? చూడాలంటే ఏప్రిల్‌ 12 వరకూ ఆగాల్సిందే. మొదటి పార్ట్‌లో తమన్నాపై చిత్రీకరించిన ఓ సాంగ్‌లో మిల్కీబ్యూటీ డాన్సులు ఇరగదీసేసింది. ఈ సీక్వెల్‌ కోసం కూడా తమన్నాపై ఆలాంటిదే అంతకు మించి.. అనిపించేలా ఓ సాంగ్‌ ఉండబోతోందనీ తెలుస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS