'మిస్ట‌ర్ మ‌జ్ను'.. మూడు రోజుల‌కు ఎంతొచ్చింది?

By iQlikMovies - January 28, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

ఈ శుక్ర‌వారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర మెరిసిన ఒకే ఒక్క సినిమా... `మిస్ట‌ర్ మ‌జ్ను`. పెద్ద‌గా పోటీ లేక‌పోయిన‌ప్ప‌టికీ.. మ‌జ్ను అనుకున్న స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టుకోలేక‌పోతోంది. శుక్ర‌వారం డ‌ల్‌గా మొద‌లైన మ‌జ్ను ఇన్నింగ్స్‌... శ‌ని, ఆది వారాల్లోనూ అదే విధంగా సాగింది. తొలి మూడు రోజుల‌కు రూ.9.20 కోట్ల షేర్ ద‌క్కించుకుంది. అఖిల్ గ‌త చిత్రం `హ‌లో` ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ తొలి మూడు రోజుల్లో దాదాపు 11 కోట్లు సాధించింది. హ‌లోతో పోల్చినా.. మ‌జ్నుకి ద‌క్కించి చాలా త‌క్కువ‌. 

 

నైజాంలో 2.8 కోట్లు సాధించిన ఈ చిత్రం, సీడెడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక కోటి 7 ల‌క్ష‌లు మాత్ర‌మే సంపాదించింది. ఓవ‌ర్సీస్‌లో మ‌జ్ను వ‌సూళ్లు మ‌రీ దారుణంగా ఉన్నాయి. అక్క‌డ ఈ సినిమా రూ.3.7 కోట్ల‌కు కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ కోటి రూపాయ‌లు కూడా రాలేదు. ఓవ‌ర్సీస్ పంపిణీ దారుడు భారీగా న‌ష్ట‌పోయే అవ‌కాశాలున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. సోమ‌వారం నుంచి వ‌సూళ్లు మ‌రింత మంద‌గించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నెల‌లో ఇది మ‌రో డిజాస్ట‌ర్ కింద లెక్క‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS