నిఖిల్‌... సినిమాలు మానేసి వెళ్లిపో...!

By iQlikMovies - January 27, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో మ‌రో వివాదం రాజుకుంది. ఈసారి ఈ వివాదం టైటిల్ చుట్టూ న‌డుస్తోంది. నిఖిల్ క‌థానాయ‌కుడిగా `ముద్ర‌` అనే చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇదే పేరుతో నిర్మాత న‌ట్టికుమార్ జ‌గ‌ప‌తిబాబు హీరోగా ఓ సినిమాని రూపొందించారు. ఈ సినిమా ఎప్పుడో పూర్త‌య్యింది. కానీ ఈనెల 25న విడుద‌లైంది.

 

`ముద్ర‌` పేరుతో బుక్ మై షోలో టికెట్ల అమ్మ‌కం ప్రారంభించారు. ఇది నిఖిల్ న‌టించిన `ముద్ర‌` సినిమానే అని చాలామంది భావించి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. విష‌యం తెలిసిన నిఖిల్ రంగంలోకి దిగి `ఆ సినిమానాది కాదు.. నా సినిమా విడుద‌ల‌కు ఇంకా టైముంది. ద‌య‌చేసి ఈ సినిమా చూడొద్దు` అని సోష‌ల్ మీడియా ద్వారా స్పందించాడు.

 

ఇప్పుడు ఈ ఇష్యూని న‌ట్టికుమార్ త‌న సినిమాకి ప‌బ్లిసిటీగా వాడుకుంటున్నాడు. `ముద్ర టైటిల్ నాది. ఈ సినిమా చూడొద్ద‌ని చెప్ప‌డానికి నిఖిల్ ఎవ‌రు?  అస‌లు ముద్ర టైటిల్ నిఖిల్ ద‌గ్గ‌ర ఉందా?  ఈ విష‌య‌మై చ‌ర్చ‌కు ఎక్క‌డ‌కు ర‌మ్మ‌న్నా వ‌స్తా. లేదంటే నిఖిల్ సినిమా ప‌రిశ్ర‌మ నుంచి వ‌దిలి వెళ్లిపోవాలి` అంటూ తీవ్ర స్థాయిలో న‌ట్టికుమార్ విరుచుకుప‌డుతున్నాడు.  

 

జ‌గ‌ప‌తిబాబు `ముద్ర‌` అనే ఓ సినిమా చేస్తున్నాడ‌ని, అది విడుద‌ల అయ్యింద‌న్న సంగ‌తి కూడా ఎవ‌రికీ తెలీదు. నిఖిల్ పుణ్య‌మా అని ఆ సంగ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాన్ని న‌ట్టికుమార్ ప‌బ్లిసిటీగా వాడేసుకుంటున్నాడు. న‌ట్టికుమార్ వ్యాఖ్య‌ల‌కు నిఖిల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS