ముని సిరీస్‌లో రూపొందిన మూడు సినిమాలూ సూపర్ హిట్స్ అయ్యాయి. అదే సిరీస్‌లో ఇప్పుడు నాలుగో మూవీగా తెరకెక్కుతోన్న 'కాంచన 3' (ముని 4) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లారెన్స్ రాఘవ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలు హారర్ కామెడీ చిత్రాలుగా ప్రత్యేక ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నాయి. ఇక తాజా సిరీస్ 'కాంచన 3' విషయానికొస్తే, కూసింత గ్లామర్ ఎక్కువ చేసినట్లు కనిపిస్తోంది లారెన్స్ రాఘవ.
అసలే ఈ జోనర్‌లో వస్తున్న చిన్న సినిమాలు కూడా ఒక్కోసారి మంచి విజయాలు అందుకుంటున్నాయి. అందుకు కారణం సినిమాలో హారర్ కంటెన్ట్‌తో పాటు, హాట్ కంటెన్ట్‌ని పుష్కలంగా వాడేయడమే. అందుకే ఈ జోనర్‌కే పితామహుడు, సీనియర్ అయిన లారెన్స్ కూడా అదే ఫార్ములాని ఈ సారి కాస్త గట్టిగా వాడేసినట్లు కనిపిస్తోంది. 'ముని' తొలి పార్ట్‌లో వేదిక క్యాజువల్‌గా కనిపించినా, రెండో పార్ట్‌లో లక్ష్మీరాయ్ తన అందాలతో కవ్వించింది. మూడో పార్ట్ 'కాంచన 2'లో తాప్సీ హాట్ హాట్ సొగసులారేసింది.
ఇక తాజా సిరీస్ 'కాంచన 3' విషయానికొస్తే, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు భామలు తమ అందాలతో విందు చేయడానికి రెడీ అయిపోయారు. వేదిక, ఓవియా, నిక్కీ తంబోలీ.. ఈ ముగ్గురూ పోటా పోటీగా గ్లామర్ పండించనున్నారట. అంటే 'కాంచన 3'కి హారర్ ఎలిమెంట్స్‌తో పాటు, గ్లామర్ మసాలాని కూడా బాగా దట్టించాడన్న మాట లారెన్స్. వేదిక హాట్‌నెస్ గతంలో చూసిందే. ఓవియా సంగతి చెప్పక్కర్లేదు. ఇక లేటెస్ట్‌గా 'చీకటి గదిలో.. ' అంటూ గ్లామర్‌తో చితక్కొట్టేసింది ముద్దుగుమ్మ నిక్కీ తంబోలీ. సో 'కాంచన 3' 'తీన్'మార్ గ్లామర్.. ఇది గ్యారంటీ గురూ.