జోరందుకుంటున్న నాని 'జెర్సీ' ప్రమోషన్స్

మరిన్ని వార్తలు

స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న నాని కొత్త చిత్రం 'జెర్సీ'. గతంలో భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో కబడ్డీ ఆటగాడిగా ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు క్రికెటర్ గా తెరమీద కనిపించనున్నాడు. 'మళ్ళీ రావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి సురేష్ నాగ వంశీ నిర్మాత. విభిన్న కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది. కాగా, ఇప్పటికే నిర్మాణాంతర పనులు కూడా పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇకనుండి ప్రమోషన్స్ లో బిజీ కానుంది.

 

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో వరుస విజయాలు అందుకుని 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో కమర్షియల్ గా కాస్త దెబ్బ తిన్న నానికి 'దేవదాస్‌' చిత్రం కాస్త ఊరటనిచ్చింది. అయితే 'జెర్సీ' రూపంలో అంతకు మించిన సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకోనున్నాడనీ సినీ వర్గాల అభిప్రాయం. నిన్న లిరికల్ వీడియో రిలీజ్ సందర్భంగా నాని మాట్లాడుతూ, జెర్సీ తన సినీ కెరీర్ లో ఓ కీలకమైన చిత్రం అని పేర్కొన్నాడు. 

 

ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ ద్వారా జెర్సీ ప్రమోషన్స్ జోరు పెంచేశారు నాని & టీమ్. ఇదిలాఉండగా.. జెర్సీ అనంతరం నేచురల్ స్టార్ నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS