స్టార్ హీరోయిన్‌గా రకుల్ హవా టాలీవుడ్‌లో ఉన్నప్పుడే తన తమ్మున్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంది రకుల్ ప్రీత్‌సింగ్. ఆ రకంగా రెండేళ్ల క్రితమే తన సోదరుడు అమన్ పేరును తెర పైకి తీసుకొచ్చింది. అయితే అప్పటికి అమన్ ఇంకా నటనలో శిక్షణ తీసుకుంటుండడంతో తెరంగేట్రానికి ఇంత సమయం పట్టింది. ఈ లోగా రకుల్‌కి తెలుగులో హవా పూర్తిగా తగ్గిపోయింది.
అయినా కానీ సోదరుడికి తొలి సినిమాతోనే స్టార్ వేల్యూ తీసుకురావడానికి చేయాల్సిందంతా చేస్తోందట. అందుకోసం రకుల్ తనకు టాలీవుడ్‌లో ఉన్న పరిచయాల్ని వాడుకుంటోందట. యంగ్ హీరోస్‌తో మంతనాలు జరుపుతోందనీ సమాచారమ్. ఇక అమన్ తెరంగేట్రం మూవీని తెరకెక్కిస్తున్నది ఓ యంగ్ డైరెక్టరే. నాగశౌర్యతో అప్పుడెప్పుడో 'నీ జతలేక' అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు దాసరి లారెన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆయనకిది రెండో సినిమా.
రజనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. మోనికా శర్మ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. రకుల్‌కి తొలి సినిమా కలిసి రాకపోయినా, 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో మంచి హిట్ కొట్టింది. తర్వాత 'లౌక్యం' తదితర సినిమాలతో బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ స్టాటస్‌ని సంపాదించింది. చూడాలి మరి అమన్, అక్క రకుల్‌లా స్టార్‌డమ్ సంపాదించుకుంటాడో.? లేదో.?