ఆరు పదుల వయసులోనూ 16 ఏళ్ల కుర్రాళ్లను మించిన ఫిట్‌నెస్‌తో, ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'పేట'లో రజనీకాంత్ ఎనర్జీకి కుర్రకారు ఆశ్చర్యపోయారు. అందుకే అదే సినిమాలో హీరోయిన్ మేఘా ఆకాష్‌తో డైరెక్టర్ ఓ డైలాగ్ కూడా పలికించేశాడు. 'చూడ్డానికి చాలా స్టైలిష్‌గా, చిన్న పిల్లాడిలా ఉన్నారే..' అని. అదీ ఆయన ఎనర్జీ.
ఇకపోతే తాజాగా రజనీకాంత్, క్రియేటివ్ డైరెక్టర్ మురుగదాస్ సినిమాలో నటిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మురుగదాస్‌తో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. సామాజిక అంశాన్ని మాస్ ఆడియన్స్‌కి అర్ధమయ్యేలా కమర్షియల్ హంగులు జోడించి చెప్పడం ఎలాగో మురుగదాస్‌కి తెలిసినంతగా మరొకరికి తెలియదనడం అతిశయోక్తి కాదు. ఆ అంశాలకి స్టార్‌డమ్ జోడై ఆ సినిమాలు సంచలన విజయాల్ని అందుకున్న సందర్భాలు గతంలో చూశాం.
ఇప్పుడు రజనీకాంత్ వంటి స్టార్ హీరోతో మురుగదాస్ తీయబోయే చిత్రం ముంబయ్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతోందట. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. 'దర్బార్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని ఫిక్స్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ తాజాగా విడుదల చేశారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందీ ఫస్ట్‌లుక్. బుధవారం నుండి 'దర్బార్' రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.