రాజమౌళి అడిగితే ఎవరైనా కాదనగలరా.?

మరిన్ని వార్తలు

'బాహుబలి'తో తెలుగు సినిమా ఖ్యాతిని దేశ దేశాల చాటి చెప్పిన ఘనుడు రాజమౌళి. అందుకే ఆయన సినిమా అంటే అంచనాలు అన్ని భాషల్లోనూ ఉండడం సహజం. 'బాహుబలి' తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమాలో తెలుగు నుండే కాక ఇతర భాషల నుండి కూడా పలువురు ప్రముఖ నటీనటుల్ని తీసుకుంటానని ఆయన గతంలోనే చెప్పారు. అందులో భాగంగానే ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు అయిన సముద్రఖనిని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. ఈ విషయాన్ని ఆయన ఓ తమిళ మ్యాగ్జైన్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. 

 

తమిళంలో సక్సెస్‌ఫుల్‌ మూవీ 'నాడోడిగల్‌'ని తెరకెక్కించిన డైరెక్టర్‌ సముద్రఖని. ఈ సినిమా తెలుగులో 'శంభో శివ శంభో' టైటిల్‌తో రీమేక్‌ అయ్యింది. 'నాడోడిగల్‌' సినిమా చూసి రాజమౌళి సముద్రఖనిని ప్రశంసిస్తూ, ఓ పెద్ద మెసేజ్‌ పెట్టారట. అప్పటి నుండీ రాజమౌళి సర్‌తో టచ్‌లో ఉన్నానని సముద్రఖని అన్నారు. ఆయన తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీలో ఓ పాత్ర ఉంది చేస్తావా? అని అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా, వెంటనే ఓకే చెప్పానని చెప్పారు. 

 

ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌లో బిజీగా ఉన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీలో హీరోయిన్స్‌ లిస్టు ఇంకా రివీల్‌ కాలేదు. అయితే కీర్తిసురేష్‌ పేరు మాత్రమే ఇంతవరకూ ప్రచారం జరిగింది. ఓ బాలీవుడ్‌ భామ కూడా నటిస్తోందని టాక్‌. తాజాగా ఈ లిస్టులోకి ప్రియమణి, అదితీరావ్‌ హైదరీ పేర్లు వచ్చి చేరాయి. చూడాలి మరి జక్కన్న సినిమాలో నటించే ఛాన్స్‌ ఏ హీరోయిన్స్‌ని వరిస్తుందో. చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS