అఖిల్‌కి నయాసాల్‌ కలిసొచ్చేనా.?

మరిన్ని వార్తలు

తెరంగేట్రానికి చేసిన హడావిడి అదిరింది. కానీ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. రీఎంట్రీ అంటూ వచ్చిన మూవీ కూడా నిరాశపరిచింది. అవును ఇదంతా అక్కినేని అందగాడు అఖిల్‌ గురించే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 'మిస్టర్‌ మజ్ను' అంటూ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నాడు. నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 'తొలిప్రేమ'తో హిట్‌ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

కాగా ఈ సినిమా విషయంలో అఖిల్‌ చాలా కాన్పిడెంట్‌గా ఉన్నాడట. టీజర్‌, ప్రచార చిత్రాలు పెద్దగా అంచనాలు క్రియేట్‌ చేయనప్పటికీ, సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్‌ ద్వారా అందుతోన్న సమాచారమ్‌. యాక్షన్‌ హీరోగా స్ధిరపడాలని అఖిల్‌ తొలి సినిమా నుండీ తాపత్రయపడుతున్నాడు. కానీ సరైన హిట్‌ పడితేనే కదా, ఎలా ఫిక్సవుతాడనేది తేలేది. యాక్షన్‌ సీన్స్‌లో కొత్తదనం కోసం తొలి సినిమా నుండీ సాహసాలు చేస్తూనే ఉన్నాడీ యంగ్‌ హీరో. 

 

అలాగే ఈ సినిమాలో కూడా యాక్షన్‌ ఇరగదీసేయనున్నాడట అఖిల్‌. అయితే హిట్‌ అయితేనే కలిసొచ్చేది. కానీ ఈ నయాసాల్‌ అఖిల్‌కి బాగా కలిసొచ్చేలానే ఉంది. పోజిటివ్‌ వైబ్స్‌ కనిపిస్తున్నాయి. ఒక్క హిట్‌ వస్తే చాలు, అఖిల్‌కి కాన్ఫిడెన్స్‌ పెరిగిపోతుంది. ఈ నెలాఖరుకే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు సాయంత్రం 'మిస్టర్‌ మజ్ను' నుండి మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారు. కొత్త సంవత్సరం అఖిల్‌కి మంచి సక్సెస్‌నివ్వాలని ఆశిద్దాం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS