యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరిని ద్వితీయ విఘ్నం వెంటాడింది. తొలి సినిమా 'తొలిప్రేమ'తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. కానీ అఖిల్‌తో చేసిన 'మిస్టర్ మజ్ను' మాత్రం నిరాశనే మిగిల్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన 'మిస్టర్ మజ్ను' రిజల్ట్ రివర్స్ గేర్ వేసింది. తొలిరోజు ఓకే అనిపించినా, మెల్ల మెల్లగా నెగిటివ్ టాక్లోకి వచ్చేసింది.
ప్రచార చిత్రాలతో 'మిస్టర్ మజ్ను' ఓ స్థాయి అంచనాల్ని క్రియేట్ చేసింది. కానీ విడుదలయ్యాక జస్ట్ యావరేజ్ అని సరిపెట్టుకోవాలో, లేక డిజాస్టర్ ఖాతాలోనే వేసేయాలో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది ట్రేడ్ పండితులకు. వెంకీ అయినా అఖిల్‌ని ఆదుకుంటాడేమో అనుకుంటే, ఆ రూట్లో కూడా అఖిల్‌కి నిరాశే మిగిలింది. ద్వితీయ విఘ్నం ఉండకూడదంటారు పెద్దలు.
కానీ తొలిప్రేమతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకీకి 'మజ్ను' రూపంలో దాన్ని తప్పించుకోలేకపోయాడు. వీకెండ్ ఎలాగో గడిచిపోయింది. ఇక సోమవారం నుండి టాక్‌తో సంబంధం లేకుండా 'మజ్ను' పుంజుకునే అవకాశాలున్నాయా అంటే చెప్పడం కష్టమే. ఇక ఓవర్సీస్లో 'మిస్టర్ మజ్ను' డిజాస్టర్ టాక్ తెచ్చేసుకుంది. దాంతో అఖిల్ కెరీర్ మళ్లీ అనుమానంలో పడిపోయింది.