రౌడీ స్టార్‌గా ఫ్యాన్స్ మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన విజయ్ దేవరకొండ ఆసుపత్రిలో చేరారంటూ గాసిప్స్ వస్తున్నాయి. హాస్పిటల్‌లో చేరేంతగా అసలింతకీ విజయ్ దేవరకొండకు ఏమైందట.? వివరాల్లోకి వెళితే క్యాజువల్ ఫీవర్ కారణంగా విజయ్ రెగ్యులర్ ట్రీట్‌మెంట్ కోసమే ఆసుపత్రికి వెళ్లారట. ఆ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. బిజీ షెడ్యూల్స్ కారణంగా విజయ్ దేవరకొండకు కాస్త సుస్తీ చేసిందట. షూటింగ్స్‌కి ఇబ్బంది కాకూడదనే ముందు జాగ్రత్తతో ఆసుపత్రికి వెళ్లి మెరుగైన చికిత్స చేయించుకున్నారట.
ఈ విషయం సర్క్యులేట్ అయిన కారణంగా ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక ప్రతీ చిన్న ఇష్యూ అనవసరంగా హైలైట్ అయిపోతోంది. ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. మొన్నీ మధ్యనే కమెడియన్ కమ్ హీరో సునీల్ ఓ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడనీ, పరిస్థితి విషమంగా ఉందంటూ బీభత్సంగా న్యూస్ వైరల్ అయిపోయింది. ఇన్ టైంలో సునీల్ రెస్పాండ్ అయ్యి 'నేను క్షేమంగానే ఉన్నాను మొర్రో..' అని చెప్పేంతవరకూ ఈ గాసిప్స్‌కి ఫుల్ స్టాప్ పడలేదు.
అలాగే ఇప్పుడు మన రౌడీస్టార్ విజయ్ దేవరకొండ సుస్తీ విషయమై వచ్చిన న్యూస్ కూడా అంతేనేమో. విజయ్ రెస్పాండ్ అయితే కానీ ఆగేలా లేదు. ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. మేలో ఈ సినిమా విడుదల కానుంది. వీటితో పాటు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు విజయ్ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే.