'సైరా' నుండి 'రాజా పాండి' ఎంట్రీ.!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ చిరంజీవికి గురువుగా నటిస్తుండగా, తమిళం నుండి ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

 

ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు విజయ్‌ సేతుపతి ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. రాజా పాండి అనే పాత్రలో విజయ్‌ సేతుపతి కనిపించనున్నారు. చేతిలో ఖడ్గం, నుదుట, భుజాలపైనా నామాలు, మెడలో వీరత్వాన్ని ప్రదర్శించేలా పులిగోరు షార్ప్‌ లుక్స్‌తో విజయ్‌ సేతుపతి లుక్‌ ఆకట్టుకుంటోంది. 

 

ఆల్రెడీ నయనతార, తమన్నా, సుదీప్‌ తదితర నటీనటుల లుక్స్‌ బయటికి వచ్చి మంచి రెస్పాన్స్‌ అందుకున్నాయి. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామ్‌చరణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS