బన్నీ సినిమాకి ఎన్టీఆర్‌ స్వీట్‌ రివ్యూ.!

మరిన్ని వార్తలు

'అల వైకుంఠపురములో..' సినిమాకి క్రిటిక్స్‌ ఇచ్చే రివ్యూలు ఎలాగూ పోజిటివ్‌గా వచ్చాయి. సో బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అని తేలిపోయింది. అందరికీ సినిమా నచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే, ఓ హీరో సినిమాకి ఇంకో హీరో రివ్యూ ఇస్తే ఎలా ఉంటుంది.? అలా 'అల..'కు ఎన్టీఆర్‌ రివ్యూ ఇచ్చారు. తాజాగా సినిమా చూసిన ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియాలో సరదాగా స్పందించారు. మామూలు స్పందన కాదు, ఏకంగా చిన్నపాటి రివ్యూనే ఇచ్చేశాడు ఎన్టీఆర్‌. 'సినిమా చాలా బాగుంది బావా..' అంటూ అల్లు అర్జున్‌ని ప్రశంసించాడు. ఎన్టీఆర్‌, బన్నీ బావా, బావా.. అని పిలచుకుంటారన్న సంగతి తెలిసిందే. అందుకే బావా అని స్పందిస్తూ ట్వీట్‌ చేశాడు.

ఇక త్రివిక్రమ్‌ని స్వామి అని సంబోధిస్తూ.. ట్రెమండస్‌ రైటింగ్‌ స్కిల్స్‌.. అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక తమన్‌ మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ, పూజా హెగ్దే గ్లామర్‌ అండ్‌ పర్‌ఫామెన్స్‌.. ఇలా అన్నింటినీ టచ్‌ చేస్తూ ఓ స్మాల్‌ సైజ్‌ రివ్యూ ఇచ్చేశాడు ఎన్టీఆర్‌. బన్నీ సినిమా పట్ల ఎన్టీఆర్‌ రెస్పాన్స్‌ చూసి, ఫ్యాన్స్‌ భలే ఖుషీ అవుతున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ, సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన హీరో అంటే తమ అభిమాన హీరో.. అంటూ ఫ్యాన్స్‌ గొడవలకు దిగుతుంటారు. కానీ, హీరోలు మాత్రం ఒకరికొకరు అవకాశమొచ్చినప్పుడల్లా ప్రేమాభిమానాలు చాటుకుంటూనే ఉంటారు. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు పెద్ద సినిమాలతో మహేష్‌, బన్నీ సూపర్‌ హిట్స్‌ కొట్టారు. ఇద్దరూ ఒకరి సినిమాకి మరొకరు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పుకున్నారు. అభినందించుకున్నారు. కానీ, సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ ఎప్పటిలాగే రచ్చ, రగడలతో రగిలిపోయారు. హీరోల్లో లేని పొరపొచ్చాలు, ఫ్యాన్స్‌కి ఎందుకో. ఈ కల్చర్‌లో మాత్రం ఎప్పటికీ మార్పులు రావడం లేదెందుకో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS