'నువ్వే సమస్తం.. నువ్వే సిద్దాంతం..' 'మహర్షి' అదరగొట్టేశాడు.!

మరిన్ని వార్తలు

'చోటీ చోటీ బాతే..' అంటూ మహేష్‌బాబు, అల్లరి నరేష్‌, పూజాహెగ్దేలపై నడిచే లిరికల్‌ సాంగ్‌ని ఫస్ట్‌ ఆడియో సింగిల్‌గా విడుదల చేసి, స్టిల్స్‌తో అంచనాలు పెంచేసింది 'మహర్షి' టీమ్‌. లేటెస్ట్‌గా సెకండ్‌ సింగిల్‌ వదిలింది. 'నువ్వే సమస్తం..నువ్వే సిద్ధాంతం' అంటూ సాగే ఈ సాంగ్‌లోని లిరిక్స్‌ అర్ధవంతంగా ఆకట్టుకుంటున్నాయి. మహేష్‌బాబు ఇంట్రడక్షన్‌ సాంగ్‌లా అనిపిస్తోందీ సాంగ్‌. ఈ సాంగ్‌లో మహేష్‌ స్టైలింగ్‌కి ఎప్పటిలాగే ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. 

 

మొత్తం సాంగ్‌ విదేశీ లొకేషన్స్‌లో ఉండబోతోందని ప్రోమోని బట్టి తెలుస్తోంది. బిజినెస్‌ మ్యాన్‌లా హెలికాప్టర్‌ నుండి దిగి స్టైల్‌గా సూట్‌ బటన్స్‌ సర్దుకుంటూ నడిచి రావడం ఈ సాంగ్‌ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఈ ఏడాది బాక్సాఫీస్‌కి సవాల్‌ విసిరే అసలు సిసలు దమ్మున్న సినిమా పడలేదింతవరకూ. అది మహేష్‌తోనే సాధ్యమని సింబాలిక్‌గా ఉన్నట్లున్నాయి 'నువ్వే నీ పంతం.. నువ్వే అనంతం.. గెలుపే నీ వెంట పడేలా..' అంటూ ఈ సాంగ్‌లోని లిరిక్స్‌. 

 

 

సినిమాపై అంచనాలు అయితే ఆకాశాన్నంటే రేంజ్‌లోనే ఉన్నాయి. ఆ అంచనాల్ని 'మహర్షి' అందుకుంటుందా లేదా.? అనేది మరి కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ మరోసారి మ్యాజిక్‌ చేసేలా ఉంది ఈ రెండు సాంగ్స్‌ విన్నాక. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మహర్షి' వరల్డ్‌ వైడ్‌గా మే 9న విడుదల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS