యంగ్‌ హీరో ఆది అదరగొట్టేశాడు.!

మరిన్ని వార్తలు

ఇంతవరకూ లవర్‌ బోయ్‌లా కనిపించి మెప్పించిన యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ తాజాగా ఓ పెద్ద ప్రయోగానికి తెర లేపాడు. ఎన్‌.ఎస్‌.జీ కమాండర్‌ పాత్రలో కనిపించి ఫ్యాన్స్‌కి స్పెషల్‌ కిక్‌ ఇవ్వనున్నాడు. 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌' అనే మూవీ కోసం ఆది ఈ గెటప్‌లో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు చేతుల మీదుగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఇండియా - పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది. 

 

ఇటీవల విడుదలైన కరడు కట్టిన టెర్రరిస్ట్‌ ఘాజీ బాబా లుక్‌ సినిమాపై అంచనాల్ని పెంచిన సంగతి తెలిసిందే. ప్రముఖ మాటల రచయిత అబ్బూరి రవి ఈ పాత్ర పోషించాడు. తాజాగా విడుదలైన టీజర్‌ అంచనాల్ని మరింత రెట్టింపు చేసింది. ఆడుతూ పాడుతూ తిరిగే నలుగురు కుర్రాళ్ల గ్యాంగ్‌కి పాకిస్థాన్‌ టెర్రరిస్ట్‌ల నుండి ముప్పుందని తెలిసి, వారిని ఎదుర్కొనేందుకు ఎన్‌ఎస్‌జీ కమాండర్‌గా ఆది చేసిన ప్రయత్నాలేంటనేది సినిమా కాన్సెప్ట్‌. 

 

పాకిస్థాన్‌ తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం, అందులోనూ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అందరిలోనూ దేశభక్తి పెళ్లుబికి రావడం తదితర అంశాల దృష్ట్యా ఈ తరుణంలో 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌'కి సంబంధించి ప్రీ రిలీజ్‌ బజ్‌ చాలా చాలా బాగుంది. అడవి సాయి కిరణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నిత్యా నరేష్‌, సాషా చెత్రి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS