గ్లామ్‌షాట్‌: బ్లాక్‌ హాట్‌ 'ఆర్ఎక్స్‌' పాప: ఇస్టైల్‌ కెవ్వుకేక.!

By Inkmantra - March 04, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

గ్లామర్‌లో యాంగిల్స్‌ని ఎన్ని షేడ్స్‌లో చూపించాలనేది 'ఆర్ఎక్స్‌' బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌కి తెలిసినంతగా ఈ జనరేషన్‌ భామలకు తెలియదేమో. ఆ గ్లామర్‌ అస్త్రమే ఈ బ్యూటీని బిజీగా అంత బిజీగా ఉంచుతోందనాలి. 'ఆర్ఎక్స్‌'తో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రెండు సినిమాల్లో ఛాన్స్‌ కొట్టేసింది. రెండూ సీనియర్‌ హీరోల సినిమాలే కావడం విశేషం. 

 

విక్టరీ వెంకటేష్‌తో 'వెంకీ మామ'లోనూ, మాస్‌రాజాతో 'డిస్కోరాజా'లోనూ నటిస్తోన్న ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్లు చర్చల దశలో ఉన్నాయనీ తెలుస్తోంది. ఇక తొలి సినిమాతో వచ్చిన క్రేజ్‌తో సోషల్‌ మీడియానీ తన అందంతో దున్నేస్తోందీ హాట్‌ పాప. ఎప్పటికప్పుడే సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌తో పెచ్చిపోతూ, ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతోంది. తాజాగా బ్లాక్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో పాయల్‌ అందాలు కెవ్వుకేక పుట్టిస్తున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS