య'మహా'పై హీటెక్కించేసిన 'బుల్‌ బుల్‌' పాయల్‌.!

By Inkmantra - April 02, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

పాప సో హాట్‌.. సో హీట్‌.. ఇలాంటి మాటలన్నీ తొలి సినిమాతోనే అనిపించేసుకుంది ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌. 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో కుర్రకారు గుండెల్లో చక్కగా గూడు కట్టేసుకుంది. ఇక ఇప్పుడు 'బుల్‌ రెడ్డీ..' అంటూ ఓ స్పెషల్‌ సాంగ్‌తో వచ్చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా తెరకెక్కుతోన్న 'సీత' సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

ఈ సాంగ్‌ని బుధవారం ఉదయం 10.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా పాయల్‌ స్టిల్స్‌ని రిలీజ్‌ చేసి, ఆశక్తిని పెంచేసింది. బుల్లట్‌పై పాయల్‌ రాజ్‌పుత్‌ హీటెక్కించేసే ఈ స్టిల్స్‌కి అప్పుడే రెస్పాన్స్‌ అదిరిపోతోంది. స్టిల్‌ అదిరిందమ్మా పాయల్‌ భామా.. అంటూ లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు. స్టిల్స్‌ చూస్తుంటే, పాయల్‌ ఇంకోసారి హీటెక్కించడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చేశారు ఆడియన్స్‌. 

 

'సీత'కు పాయల్‌ స్పెషల్‌ సాంగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతుందనిపిస్తోంది. ప్రస్తుతం పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా రవితేజతో 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తోంది. మరోవైపు 'వెంకీ మామ'లో వెంకటేష్‌తో జోడీ కడుతోంది. పాయల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోన్న ఓ సినిమా లేటెస్ట్‌గా పట్టాలెక్కింది. సి.కళ్యాణ్‌ ఈ సినిమాకి నిర్మాత. కాగా తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తోందీ క్రేజీ బ్యూటీ. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS