మరోసారి వంచేసిన గోపిక.!

మరిన్ని వార్తలు

ఇటీవల ఏరియల్‌ యోగాలో భాగంగా తన శరీరాన్ని గాల్లో వేలాడదీసి, అందమైన విల్లులా వంచేసిన పూజాహెగ్డే మరోసారి తన శరీరంతో ప్రయోగం చేసి, నెటిజన్స్‌కి షాకిచ్చింది. ఈ సారి గాల్లో కాదు కానీ, నేలమీదే విల్లులా వెనక్కి వంచేసింది. బాబోయ్‌ ఇలాంటి క్రిటికల్‌ ఫీట్లు చేయాలంటే చాలా ప్రాక్టీస్‌ కావాలండోయ్‌. ఫిట్‌నెస్‌ నిపుణుల ఆధ్వర్యంలోనే ఇలాంటి ఫీట్లు వేయాల్సి ఉంటుంది. 

 

తాజాగా పూజా హెగ్డే వేసిన ఈ ఉల్టా ఫీట్‌కి ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోని పోస్ట్‌ చేసి, 'ఈ వీడియో ఇక్కడ పోస్ట్‌ చేసేందుకు అర్హమైనదే..' అని జస్టిఫికేషన్‌ క్యాప్షన్‌ కూడా ఈ ముద్దుగుమ్మే ఇచ్చేసింది. ఈ వీడియోకి బోలెడన్ని లైకులు, కామెంట్లు వచ్చేస్తున్నాయ్‌. అసలింతకీ పూజాహెగ్దే ఎందుకిన్ని క్రిటికల్‌ వర్కవుట్లు చేసేస్తోందో కానీ, నిజానికి ఈ బ్యూటీ స్లిమ్‌గానే ఉంటుంది.

 

అయితే వర్కవుట్స్‌ అనేవి కేవలం స్లిమ్‌గా ఉండేందుకే కాదు, ఆరోగ్యంతో పాటు, శరీరంపై పూర్తి అదుపు సాధించేందుకే అంటోంది అందాల పూజాహెగ్దే. బికినీలు, షార్ట్‌ డ్రస్సుల్లో అందాల ఆరబోత బోర్‌ కొట్టింది కాబోలు పూజా ఈ నయా ట్రెండ్‌తో కిర్రాకు పుట్టిస్తోంది. ఏది ఏమైనా పూజాహెగ్దే ఫాలో చేస్తున్న ఈ ఫీట్లు కూసింత కష్టమే సుమీ. సహజంగా ఆచరించలేనివివి. 

 

ఇదిలా ఉంటే, ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. 'మహర్షి' సినిమాలో మహేష్‌కి జోడీగా నటిస్తోంది. తర్వాత ప్రబాస్‌తో ఓ సినిమా చేయనుంది. బాలీవుడ్‌లోనూ ఒక సినిమాలో నటిస్తోంది. ఇవి కంప్లీట్‌ అయ్యేలోగా మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు పూజా ఖాతాలో పడతాయేమో చూడాలి మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS