అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో విజయ్ దేవరకొండ స్టార్ డమ్ మారిపోయింది. పెద్ద హీరోలతో సమానంగా విజయ్ సినిమాకి మార్కెట్ జరుగుతోంది. విడుదలకు ముందే విజయ్ సినిమా హాట్ కేకులా అమ్ముడుపోతోంది. గీత గోవిందం ఏకంగా వంద కోట్లు సాధించడంతో బయ్యర్లు విజయ్ సినిమా కోసం ఎగబడుతున్నారు. ఆ ఎఫెక్ట్ 'డియర్ కామ్రేడ్'పై పడింది.
ఈ సినిమా విడుదలకు ముందే భారీ లాభాల్ని సాధించింది. థియేటరికల్ రైట్స్ రూపంలో రూ.40 కోట్లు వచ్చేశాయి. డిజిటల్, శాటిలైట్ రూపంలో మరో 15 కోట్లు ఖాయం. అంటే 55 కోట్ల వ్యాపారం జరిగిపోయిందన్నమాట. యువతరం హీరోల్లో ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్న వాళ్లెవ్వరూ లేరు. ఇది విజయ్ స్టామినాకు నిదర్శనం.
విజయ్ దేవరకొండతో రష్మిక జోడీ కట్టిన రెండో సినిమా ఇది. కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా విజయ్ - రష్మికల ముద్దు హాట్ టాపిక్‌గా మారింది. ఈలోగానే ఈ సినిమా హాట్ కేకులా అమ్ముడుపోవడం విశేషం.