గ్లామ్‌షాట్‌: నల్లతాచులా సొగసుల కాటేసి.!

మరిన్ని వార్తలు

'కహోనా ప్యార్‌ హై' అంటూ బాలీవుడ్‌కి క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అమీషా పటేల్‌. మోడలింగ్‌ రంగం నుండి వచ్చి హీరోయిన్‌గా ఎదిగింది. సౌత్‌లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'బద్రి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత 'నరసింహుడు', 'నాని' తదితర చిత్రాల్లో ఎన్టీఆర్‌, మహేష్‌బాబు వంటి స్టార్స్‌ సరసన ఆడి పాడింది. 

 

ఇటీవలే ఓ చిన్న సినిమా 'ఆకతాయి' కోసం ఐటెం గాళ్‌ అవతారమెత్తింది కూడా. ఈ మధ్య అవకాశాలు కాస్త సన్నగిల్లడంతో, తనలోని వంపు సొంపుల్ని బికినీలో పొందుపరచి ఫ్రెష్‌ ఫ్రెష్‌గా ఎగ్జిబిషన్‌కి దిగింది. మొన్నా మధ్య రెడ్‌ హాట్‌ బికినీలో వయ్యారాలు పోతే, తాజాగా బ్లాక్‌ హాట్‌ టూ పీస్‌ బికినీలో కైపెక్కించింది అమీషా పటేల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS