'కల్కి' టీజర్‌: టైమింగ్‌ అదిరిందయ్యా వర్మా.!

మరిన్ని వార్తలు

'అ' సినిమాతో టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్‌లుక్‌ దగ్గర్నుంచి ప్రతీ ప్రచార చిత్రాన్ని చాలా ఇన్నోవేటివ్‌గా డిజైన్‌ చేశాడీ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. విడుదలకు ముందే సినిమాపై భారీగా ఆశక్తి పెంచేసినా విడుదలయ్యాక ఆశించిన రిజల్ట్‌ అందుకోలేకపోయాడు. అయినా కానీ ఓ విభిన్న కథాంశాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్‌గా ప్రశాంత్‌ వర్మ పేరు అందరికీ గుర్తుండిపోయింది. 

 

ఇకపోతే ఆ తర్వాత ప్రశాంత్‌ వర్మ రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. అందులో ఒకటి మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్‌ రోల్‌ పోషిస్తోన్న బాలీవుడ్‌ 'క్వీన్‌' తెలుగు రీమేక్‌ అయిన 'దటీజ్‌ మహాలక్ష్మీ'. ఇక రెండోది సీనియర్‌ హీరో రాజశేఖర్‌తో రూపొందుతోన్న 'కల్కి'. దశావతారాల్లో పదో అవతారమే కల్కి. ఈ పేరుతో సినిమా అంటే ఈ సినిమాపైనా అంచనాలు బాగానే ఉన్నాయి. 

 

పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఈ సినిమాలో రాజశేఖర్‌ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ మంచి ముహూర్తం ఫిక్స్‌ చేసింది. అదే ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటల 10 నిముషాల 10 సెకన్లకు. టైమింగ్‌ అదిరింది కదా. టీజర్‌ కూడా అదిరిపోయేలానే ఉంటుందట. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కి రెస్పాన్స్‌ బాగా వస్తోంది. ఈ సినిమాలో అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS