నాని - ఇంద్రగంటి సినిమా కోసం బాలీవుడ్ భామ

By Thejaswini Allam - March 14, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు సినీ పరిశ్రమకు తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణతో నాని ఓ సినిమా చేయబోతున్నాడన్న విషయం తెలిసిందే. అష్టా చమ్మా, జెంటిల్ మాన్ వంటి విజయవంతమైన సినిమాలను అందించిన ఆయనతో సినిమా చేయటానికి నాని ఎప్పుడూ ముందుంటాడు. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరిని ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. 

 

అదితి రావు హైదరి తొలిసారిగా నటించిన తెలుగు సినిమా సమ్మోహనం. ఈ సినిమా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కినదే. ఈ చిత్రంలో అదితి నటనకు ఇంద్రగంటి చాలా ఆకర్షితుడయ్యాడట మరియు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. అందుకే.. నాని, సుదీర్ బాబు కలిసి నటించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అదితి రావు హైదరీని సంప్రదించారట.

 

అదితి కూడా ఇంద్రగంటితో కలిసి పనిచేయడానికి ఆసక్తి ఉన్నట్లు పలు సార్లు చెప్పింది. అందుకే ఈ చిత్రంలో నటించమని ఆఫర్ ఆమె వద్దకు వచ్చినప్పుడు వెంటనే అంగీకరించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS