విశ్వనటుడు కమల్‌హాసన్ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. మక్కల్ మీది మయ్యుం అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేసే నిమిత్తం రాజకీయాల్లోకి తెరంగేట్రం చేశారు. మరోవైపు ఆయన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్‌లో నటిస్తున్నారు.
అయితే ఓ వైపు రాజకీయాలు, ఇంకోవైపు సినిమాలు.. ఇలా ఈ రెండింటినీ మ్యానేజ్ చేయలేననీ, పూర్తిగా సేవ చేయాలని తన నుండి ప్రజలు ఆశిస్తే.. సినిమాలకు గుడ్ బై చెప్పేసి నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమవుతాను.. అని కమల్ చెప్పారు. పూర్తి సేవ అంటే 'ముఖ్యమంత్రి పదవి' అని ఇన్‌డైరెక్ట్‌గా కమల్ చెప్పారనుకోవాలేమో. తనను సీఎంని చేస్తే ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చేస్తానని కమల్ మాటల వెనక అర్ధమనీ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలోని లోగుట్టు పెరుమాళ్లకెరుక.
ఇక సినిమాల విషయానికొస్తే, ఆయన నటిస్తున్న 'భారతీయుడు 2' షూటింగ్ ఆగిపోయిందంటూ ఈ మధ్య వార్తలొచ్చాయి. ఆ వార్తల్ని ఖండించారు కమల్. 'భారతీయుడు 2' షూటింగ్ జరుగుతోందని కమల్ స్పష్టం చేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ద్విపాత్రాభినయంలో కమల్‌హాసన్ నటిస్తున్నారు ఈ సినిమాలో. అందులో ఒకటి వృద్ధ సేనాపతి పాత్ర. ఈ పాత్రే సినిమాకి అత్యంత కీలకం.