'వినయ విధేయ రాముడి' కండల వెనక సీక్రెట్‌ తెలుసా.?

మరిన్ని వార్తలు

సినిమా సినిమాకీ ఎంతో కష్టపడుతుంటాడు చరణ్‌. 'ధృవ' కోసం ఓ రకం కష్టమైతే, 'రంగస్థలం' కోసం మరో విధంగా కష్టపడ్డాడు. ఇప్పుడు 'వినయ విధేయ రామ' సినిమా కోసం మరింత ఎక్కువ కష్టపడుతున్నాడు. కండలు తిరిగిన శరీరం కోసం చరణ్‌ చాలా చాలా కష్టపడ్డాడు. అందుకోసం స్పెషల్‌ డైట్‌ ఫాలో అయ్యాడు చరణ్‌. అంత కష్టపడ్డాడు కాబట్టే, కండలు తిరిగిన శరీరంతో హాలీవుడ్‌ హీరోలా కనిపిస్తున్నాడు. ఆ దేహం కోసం చరణ్‌ చాలా చాలా కష్టపడ్డాడు. 

 

రోజులో 12 గంటల పాటు ఎలాంటి ఆహారం లేకుండా ఉండాల్సి వచ్చింది. మిగిలిన 12 గంటల్లో ఎంపిక చేసిన ఆహార పదార్ధాలనే తీసుకున్నాడు. ఆ వివరాల్ని 'వివిఆర్‌ డైట్‌' పేరుతో చరణ్‌ భార్య ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మద్యాహ్నం మాత్రమే రైస్‌ తీసుకునేవాడు చరణ్‌. అది కూడా బ్రౌన్‌ రైస్‌ మాత్రమే. అదీ కడుపు నిండేంత కాదు, దానికీ ఓ లెక్కుంది. చికెన్‌ బ్రెస్ట్‌, గ్రిల్ల్‌డ్‌ ఫిష్‌, స్వీట్‌ పొటాటో, గ్రీన్‌ సలాడ్‌, ఎగ్స్‌, గ్రీన్‌ వెజిటేబుల్‌ కర్రీ, సూప్‌ వంటివి ఈ డైట్‌లో ఉన్నాయి. 

 

కాఫీ తాగకూడదు. రెడ్‌ మీట్‌ తీసుకోకూడదు. వీట్‌ తీసుకోకూడదు. షుగరీ ఫ్రూట్‌ తీసుకోకూడదు. ఆల్కహాల్‌ అస్సలే ముట్టకూడదు. ఈ వివరాలు తెలుసుకోగానే, అబ్బా.! చరణ్‌ ఇంత కష్టపడ్డాడా.? అని ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ప్రముఖ డైట్‌ స్పెషలిస్ట్‌ రాకేష్‌ ఉడియారా ఈ డైట్‌ని డిజైన్‌ చేశారు. ఈ డైట్‌ వివరాల్ని ఉపాసన వెల్లడించగానే మెగా ఫ్యాన్స్‌ తాము కూడా ఈ డైట్‌ ఫాలో అవుతున్నట్లు తమ వదినమ్మకు తెలుపుతూ సోషల్‌ మీడియాలో థాంక్స్‌ చెప్పారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS