తన అందాలతో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన ముద్దుగుమ్మ ఊర్మిళ. రామ్‌గోపాల్ వర్మ - ఊర్మిళ కాంబినేషన్లో అప్పట్లో చాలా సినిమాలొచ్చాయి. అయితే ఇప్పుడీ విషయం ఎందుకు గుర్తు చేసుకోవల్సి వచ్చిందంటే, మన వర్మగారు తాజాగా సోషల్ మీడియాలో ఊర్మిళ ఫోటోని పోస్ట్ చేసి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. 'రంగీలా' సినిమాలోని ఊర్మిళ హాట్ పోజు పిక్ అది. ఈ పిక్‌తో వర్మ ఎప్పటిలాగే మరోసారి సెన్సేషన్ అయ్యారు.
అప్పట్లో ఊర్మిళకీ, రామ్‌గోపాల్ వర్మకీ మధ్య అఫైర్ ఉన్నట్లు వచ్చిన రూమర్స్ సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చాన్నాళ్లకు ఆ రూమర్స్‌ని జనం మర్చిపోయారనుకోండి. అది వేరే విషయం. తాజాగా వర్మ ఊర్మిళ పిక్‌ని పోస్ట్ చేసి, ఉమెన్స్ డే విషెస్ చెప్పడంతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. అప్పటి గుసగుసలకు వర్మ ఇప్పుడు కొత్తగా ఆధ్యం పోసినట్లైంది.
TO THE WOMAN WHO SPRINKLED COLOURS OF BEAUTY..HAPPY WOMEN’S DAY💐💐 pic.twitter.com/fDibdWxy07
— Ram Gopal Varma (@RGVzoomin) March 8, 2019
నెట్టింట్లో ఈ ఫోటో చూసినవారు వర్మపై విమర్శల అస్త్రాలు వదులుతున్నారు. పెళ్లయిపోయినా వర్మ ఊర్మిళనింకా మర్చిపోలేదా.? అంటూ ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఇటీవలే ఊర్మిళ బాలీవుడ్లో ఓ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది. మంచి అవకాశాలు వస్తే, సెకండ్ ఇన్నింగ్స్‌లో కెరీర్‌ని కంటిన్యూ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపించింది ఊర్మిళ.