డిస్కోరాజా 'కిక్‌' ఇస్తోందా.?

మరిన్ని వార్తలు

'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వి.ఐ.ఆనంద్‌ డైరెక్షన్‌లో మాస్‌ రాజా రవితేజ 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట వి.ఐ.ఆనంద్‌ రవితేజ కోసం సీరియస్‌ సబ్జెక్ట్‌ తీసుకొచ్చాడట. అయితే సబ్జెక్ట్‌ పరంగా రవితేజకి ఈ సినిమా చాలా బాగా నచ్చిందట. కానీ, మాస్‌ రాజా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌. 

 

అలాంటిది సీరియస్‌ టోన్‌లో ఆడియన్స్‌ కన్విన్స్‌ కాలేరని భావించి, ఆ స్క్రిప్టులో రవితేజ సూచనలతో చిన్న చిన్న మార్పులు చేశారట. దాంతో ఆ సీరియస్‌ టోన్‌కి డిస్ట్రబెన్స్‌ లేకుండా, స్క్రిప్టులో ఫుల్‌ ఫన్‌ యాడ్‌ చేశాడట. దాంతో 'కిక్‌ తరహాలో మ్యాగ్జిమమ్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా సబ్జెక్ట్‌ మారిపోయిందట. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. అందులో ఒకటి తండ్రి పాత్రట. తండ్రీ, కొడుకుల్లా రవితేజ ఈ సారి డబుల్‌ కిక్‌ ఇవ్వనున్నాడట. రెండు పాత్రల్లోనూ ఫుల్‌గా ఫన్‌ ఉంటుందనీ తాజా సమాచారమ్‌. 

 

ఈ సినిమాలో రవితేజకు జోడీగా 'ఆర్‌ఎక్స్‌' బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తోంది. నభా నటేష్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' సినిమాతో మూడు వేరియేషన్స్‌లో కిక్‌ ఇవ్వలేని రవితేజ 'డిస్కోరాజా'గా పక్కా కిక్‌ ఇస్తానంటున్నాడు. ఇటీవల విడుదలైన టైటిల్‌ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌లుక్‌ చూసి అంతా సీరియస్‌ మోడ్‌ మూవీనే అనుకున్నారు. కానీ తాజా సమాచారమ్‌ ప్రకారం పక్కా ఎంటర్‌టైనింగ్‌ అండ్‌ ఇంట్రెస్టింగ్‌ మూవీగా 'డిస్కోరాజా'ని రూపొందిస్తున్నారట. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS