'సాహో'కి శ్రద్ధాకపూర్‌ శాంపిల్‌ ట్రీట్‌.!

మరిన్ని వార్తలు

భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న 'సాహో' మూవీకి సంబంధించి సెకండ్‌ అప్‌డేట్‌ త్వరలో రానుంది. మార్చి 3 హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్‌డేట్‌ని విడుదల చేయనున్నారు. అయితే ఈ లోగానే ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి శ్రద్ధా డిఫరెంట్‌ కిక్‌ ఇచ్చింది. తాజాగా తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఏముందనుకుంటున్నారా.? 'సాహో'కి సంబంధించిన యాక్షన్‌ సీన్సే. 

 

శ్రద్ధాకపూర్‌ కూడా ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తోంది ఈ వీడియోలో. ఇక మన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ స్పోర్ట్స్‌ బైక్‌లో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోతున్నాడు. దుబాయ్‌లో చిత్రీకరించిన యాక్షన్‌ ఘట్టాలకు సంబంధించిన సీన్స్‌ ఇవి. త్వరలో రాబోయే 'ఛాప్టర్‌ 2'కి శాంపిల్‌ ఇది అంటూ శ్రద్ధాకపూర్‌ ఈ వీడియోని పోస్ట్‌ చేసింది. కొన్ని సెకన్లపాటున్న ఈ వీడియో చూసి ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు నీల్‌నితిన్‌ ముఖేష్‌, జాకీష్రాఫ్‌తో పాటు, సీనియర్‌ బాలీవుడ్‌ నటి మందిరాబేడీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శ్రద్ధాతో పాటు ఎవెలిన్‌ శర్మ మరో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. ఆగష్టు 15న 'సాహో' ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS