ఇదంతా డ‌బ్బు కోసం చేస్తున్నానా: రేణూ ఆవేశం

మరిన్ని వార్తలు

సోష‌ల్ మీడియా సెల‌బ్రెటీల పాలిట శాపంలా మారింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తోడూ... సెల‌బ్రెటీల‌ను కామెంట్ చేయ‌డ‌మే. ఒక్కోసారి అవి హ‌ద్దులు దాటుతున్నాయి. అలా ట్విట్ట‌ర్‌లో అభిమానుల తాకిడికి తార‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంత‌మంది దుర‌భిమానుల వ‌ల్ల రేణూ దేశాయ్ త‌ర‌చూ ఇబ్బంది ప‌డుతోంది. ట్విట్ట‌ర్‌లో చాలాసార్లు త‌న ఆవేద‌క వెళ్ల‌గ‌క్కింది. కోపం తెచ్చుకుంది. తిట్టింది కూడా. అయినా పోకిరిల ఆగ‌డాలు ఆగ‌డం లేదు. తాజాగా ఓ ఆక‌తాయి మ‌రోసారి రేణూని టార్గెట్ చేశాడు. 

 

ఈమ‌ధ్య రేణూదేశాయ్ రైతుల కోసం ఓ షో చేసింది. దానికి మంచి స్పంద‌నే వ‌చ్చింది. కానీ కొంత‌మంది మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. 'డబ్బుల కోసం మేకప్‌ వేసుకుని కెమెరా ముందు డ్రామా చేశారంతే' అని ఓ యువ‌కుడు కామెంట్ పెట్టాడు. మ‌రొక‌రు 'పవన్‌ కళ్యాణ్ మాజీ భార్యవి కాబట్టి మీకు ఈ మాత్రం గౌరవం ఇస్తున్నాం. లేకపోతే మీకు ఎటువంటి గుర్తింపు లేదు' అని మరో నెటిజన్‌ రేణూకు సందేశాలు పంపారు. ఈ కామెంట్లు రేణూని ఇబ్బందికి గురి చేశాయి. 

 

'ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా ఇలాంటి పదాల్ని సోషల్‌మీడియాలో ఒక అభిమాని మీద వాడితే ఏం జరుగుతుందో మీ అందరికీ బాగా తెలుసు. అది ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతుంది. ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే వాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదు. ఏంటి ఇది? అంటే ఓ సెలబ్రిటీని ఎవరు పడితే వాళ్లు, ఏది పడితే అది అనొచ్చు, దూషించొచ్చు. అవన్నీ ఆ సెలబ్రిటీ భరించాలి, సహించాలి. ఎలాంటి భావోద్వేగానికి గురి కాకూడదు. అంటే మామూలు మనుషులకు మాత్రమే భావాలు, భావోద్వేగాలు ఉంటాయి. సెలబ్రిటీలకు ఉండకూడదు. ప్రతిరోజు మీ సోషల్‌మీడియాలో ఎవరో ఒకరు ఏదో రకంగా మిమ్మల్ని దూషిస్తూ ఏవేవో పోస్ట్‌లు పెడుతూ ఉంటే వాటిని చదువుతున్నప్పుడల్లా మీకు ఎలా ఉంటుంటో ఒక్కసారి ఊహించుకోండి' అంటూ ఆవేదన వ్య‌క్తం చేసింది రేణూదేశాయ్

 

"నేను డబ్బు కోసం చేస్తున్నానా, పేరు కోసం చేస్తున్నానా, ఇంకేదైనా కారణం కోసం చేస్తున్నానా అన్నది ముఖ్యం కాదు. దాని వల్ల మన రైతుల సమస్యలు ఎంత వరకూ బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాం అన్నది ముఖ్యం. ఏదో ఒక రోజు ఈ ఊరూపేరూ లేని ఈ విమర్శకులు తప్పు తెలుసుకుని వారి శక్తి సామర్థ్యాల్ని ఇలా అనవసరంగా సెలబ్రిటీలను దూషించడం కోసం పెట్టకుండా ఏదో మంచి పనిపై దృష్టి పెడితే మంచిది" అంది రేణూ. ఓ మంచి ప‌ని చేయ‌డానికి ప్ర‌య‌త్నించినా ఇలాంటి కామెంట్లు రావ‌డం మాత్రం బాధాక‌ర‌మే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS