'ఛలో' అంటూ తెలుగు పరిశ్రమలోకి వచ్చి మొదటి సినిమాతోనే హిట్టు కొట్టి.. రెండవ సినిమా 'గీత గోవిందం' తో సెన్సేషనల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ 'రష్మికా మండన్నా'. ప్రస్తుతం, విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న రష్మికా తెలుగు, కన్నడ భాషల్లో చేతినిండా సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈ కన్నడ భామకి తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా పిలుపు వచ్చింది. హీరో కార్తీ సరసన ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యింది.
ఇదిలాఉంటే.. మహర్షి తరువాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాని పట్టాలెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు ప్రచారంలో ఉన్నింది. కానీ, లేటెస్టుగా రష్మిక మండన్నా పేరు తెర పైకి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా రష్మికాని ఫైనల్ చేశారట. ఇంకేముంది, కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ స్టార్ తో సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా హిట్ అయితే, రష్మికా మరి కొన్ని సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలెయ్యచ్చు.