సంక్రాంతి అల్లుళ్ల జోరు కొనసాగుతోంది. బాక్సాఫీసు దగ్గర ఆదివారం 'ఎఫ్2' అదరగొట్టింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన చిత్రమిది. దిల్‌రాజు నిర్మాత. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఆదివారం రూ.13.40 కోట్లు సాధించింది. మొత్తానికి రూ.44.50 కోట్లకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాలలో థియేటరికల్ రైట్స్ రూపంలో రూ.28 కోట్లు వచ్చాయి.
అంటే ఇప్పటికే దాదాపు రూ.15 కోట్ల లాభమన్నమాట. ఈ సినిమాతో దిల్‌రాజుకి దాదాపు రూ.30 కోట్ల వరకూ లాభాలు రావొచ్చని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజుల్లో 'ఎఫ్ 2' రూ.50 కోట్ల మార్క్‌ని దాటేయడం ఖాయం. ఈ ప్రయాణంలో.. ఇదే సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ' వసూళ్లని కూడా 'ఎఫ్ 2' అధిగమించడం విశేషం.