టీజర్‌ టాక్‌: ఈ సారైనా తేజుకి విజయం దక్కుతుందా.?

మరిన్ని వార్తలు

'చిత్రలహరి'..అప్పట్లో ఎవ్రీ ఫ్రైడే దూరదర్శినిలో వచ్చే ఓ ప్రోగ్రామ్‌. 2019లో ఓ ఫ్రైడే రిలీజ్‌ అయ్యే సినిమా.. ఆ చిత్రలహరిలో కొన్ని పాటలు, ఈ చిత్రలహరిలో కొన్ని పాత్రలు..' అంటూ టీజర్‌ స్టార్ట్‌ అయ్యింది. మొదటటి పాత్ర.. రెండో పాత్ర.. అంటూ సినిమాలోని పాత్రలని పరిచయం చేశారు. 'నా పేరులో ఉన్న విజయం నా జీవితంలోకి ఎప్పుడొస్తుందో.. అంటూ హీరో సాయిధరమ్ తేజ్ తన పాత్ర పేరును 'విజయ్‌'అని చెప్పాడు. అలాగే హీరోయిన్లు నివేదా పేతురాజ్‌, కళ్యాణీ ప్రియదర్శిన్‌ పాత్రల్ని పరిచయం చేశారు. 

 

సునీల్‌, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణ మురళి తదితర పాత్రల్ని టీజర్‌లో చూపించారు. టీజర్‌ని ఎట్రాక్టివ్‌గా కట్‌ చేశారు. కానీ సినిమాలో విజయం ఎలా ఉందో విడుదలైతే కానీ తెలీదు. ఇక తేజు విషయానికి వస్తే, కాస్త బొద్దుగా కనిపిస్తున్నాడు. గుబురు గెడ్డంతో ఉన్నాడు. సునీల్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించినట్లుగానే కనిపిస్తోంది. హీరోయిన్లు ఇద్దరూ అందంగా కనిపిస్తున్నారు టీజర్‌లో. 

 

వెన్నెల కిషోర్‌ తనదైన కామెడీ పంచ్‌లతో ఆకట్టుకుంటున్నాడు. 'బాధపడకురా.. నీక్కూడా ఎప్పుడోకప్పుడు విజయం వస్తుందిలే.. అని బ్యాక్‌ గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్‌కి ఆ వచ్చేదేదో ఆదివారం పూట రమ్మను బాబాయ్‌. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను..' అని తేజు చెప్పే డైలాగ్‌ టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది. ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని కిషోర్‌ తిరుమల తెరకెక్కిస్తుండగా, మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS