ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా? రాగ‌ల‌రా?

మరిన్ని వార్తలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఏప్రిల్ 11నే ఎన్నిక‌లు అనేస‌రికి పార్టీల‌న్నీ ప్ర‌చారాస్త్రాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఈసారి ప‌వ‌న్ కళ్యాణ్​ నేరుగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతుండ‌డంతో ఈసారి సినిమా గ్లామ‌ర్ ఎక్కువ‌గానే క‌నిపించ‌నుంది. ప‌వ‌న్ కోసం ఎప్పుడైనా స‌రే ప్ర‌చారానికి సిద్ధ‌మ‌ని మెగా హీరోలు ఎప్పుడో ప్ర‌క‌టించారు. ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ ఈ మాట చాలాసార్లు చెప్పాడు. 'బాబాయ్ కోసం ఏమైనా చేస్తా' అనే సంకేతాల్ని అందించాడు చ‌ర‌ణ్‌. నాగ‌బాబు, వ‌రుణ్‌తేజ్ ఇదే మాట చెప్పుకొచ్చారు. సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా అంతే.

 

అయితే ఈ ఎన్నిక‌ల‌లో వీళ్లంతా క‌నిపిస్తారా? జ‌న‌సేన జెండా భుజాన వేసుకుని ప్ర‌చారం చేస్తారా? అనే ఆస‌క్తి నెల‌కొంది. నాగ‌బాబుకి సినిమాల హ‌డావుడి త‌క్కువ కాబ‌ట్టి ఆయ‌న త‌మ్ముడి వెనుకే ఉండే అవ‌కాశాలున్నాయి. రామ్ చ‌ర‌ణ్‌కి జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌చారం చేయాల‌ని ఉన్నా బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి. రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌లో చ‌ర‌ణ్ బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు సైరా ప‌నులూ త‌నే చూసుకుంటున్నాడు. ఇంత బిజీ మ‌ధ్య బాబాయ్ కోసం స‌మ‌యం కేటాయించ‌గ‌ల‌డా? అనేది అనుమానం. 

 

సాయిధ‌ర‌మ్ తేజ్ 'చిత్ర‌ల‌హ‌రి' వేస‌విలో విడుద‌ల అవుతుంది. ఈ సినిమా పూర్తి చేయ‌డం, ఆ త‌ర‌వాత ప‌బ్లిసిటీ ఇవ‌న్నీ సాయిధ‌ర‌మ్ ముందున్న బాధ్య‌త‌లు. చేతినిండా సినిమాలతో ఉన్న వ‌రుణ్‌తేజ్ దీ ఇదే ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో మెగా హీరోలు.. ప‌వ‌న్ కోసం వీలు చూసుకుని రాగ‌ల‌రా?  వ‌చ్చి ప్ర‌చారం చేయ‌గ‌ల‌రా? అనేది ఇంకా తేల‌డం లేదు. సినిమాల‌కంటే ప‌వ‌న్ కళ్యాణ్ ముఖ్యం అనుకుంటే మాత్రం.. అవ‌న్నీ వ‌దిలి త‌ప్ప‌కుండా పార్టీ ప్ర‌చారంలో పాలు పంచుకుంటారు. `మ‌నం లేక‌పోయినా ప‌వ‌న్ గెలుస్తాడు` అనుకుంటే... వాళ్ల రాక అనుమానంగా మారుతుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS