'వెంకీ మామ' అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో నాగచైతన్యకు 'మామ'గా వెంకీ నటిస్తున్నాడు. అయితే నిజ జీవితంలోనూ వెంకటేష్ `మావయ్య` పాత్రలోకి వెళ్లిపోబోతున్నారు. అవును.. ఆయన ఇంట్లో పెళ్లి సందడి మొదలవ్వబోతోంది. వెంకటేష్ గారాల పుత్రిక అశ్రితకు రేపు హైదరాబాద్లో నిశ్చితార్థం జరగబోతోంది. తెలుగునాట పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఓ వ్యాపారవేత్త ఇంటికి తన కూతురిని పంపబోతున్నాడు వెంకటేష్.
అయితే ఈ వివరాలన్నీ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. రేపు హైదరాబాద్లో జరగబోతున్న నిశ్చితార్థానికి కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. వివాహం కూడా.. విదేశాల్లో ప్లాన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. వెంకటేష్ అంటేనే సింప్లిసిటీ. తన కూతురు పెళ్లి కూడా అలానే సింపుల్గా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.