అక్కినేని వారి కోడలయ్యాక సమంత తీరు పూర్తిగా మారిపోయింది. ఆటిట్యూడ్‌తో పాటు, హీరోయిన్‌గా సినిమాలను ఎంచుకోవడంలోనూ విభిన్నంగా ఆలోచిస్తోంది. అంతకు ముందు వరకూ కమర్షియల్ హీరోయిన్ అనిపించుకున్న సమంత ఇప్పుడు పర్‌ఫామెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ప్రయోగాలకు సై అంటోంది. తెలుగుతో పాటు, తమిళంలోనూ బిజీగా గడుపుతోంది. పెళ్లి తర్వాత సమంతకు తిరుగే లేకుండా పోయింది. వెల్లువలా ఆఫర్లే కాదు, సక్సెస్‌లు కూడా అలాగే వరిస్తున్నాయి.
'రంగస్థలం'తో మొదలు పెట్టిన సమంత సక్సెస్ వరుసగా 'మహానటి', 'యూటర్న్'తో కంటిన్యూ అయ్యింది. అనువాద చిత్రంగా వచ్చిన 'అభిమన్యుడు' విజయం కూడా సమంత ఖాతాలో పడింది. త్వరలో సమంత విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న 'సూపర్ డీలక్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, తెలుగులో నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్న 'బేబీ' మూవీ సమంత కెరీర్‌లో మరింత ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుంది. అలాగే పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మూవీ 'మజిలీ' కూడా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో సమంత చేస్తున్న కసరత్తుల వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ కసరత్తులు ఎందుకనేది తెలియలేదు. కానీ సమంత పడుతున్న కష్టం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ నందినీ రెడ్డి సినిమా 'బేబీ' కోసం సమంత ఇలా కష్టపడుతోందా.? ఏమో తెలియాల్సి ఉంది. మొత్తానికి సమంత ఏదో మాయ చేయబోతుందని అయితే ఈ తాజా వీడియో ద్వారా అర్ధమవుతోంది.