శ్రుతిహాసన్‌కి చేతిలో సినిమాలు లేవుగానీ.. బోలెడంత బిజీ బిజీగా ఉంటోంది. తనకో మ్యూజిక్ ట్రూప్ ఉంది. దాంతో శ్రుతి టైమ్ పాస్ చేసేస్తోంది. పైగా... తను ప్రేమలో ఉంది. లండన్‌కి చెందిన మైఖైల్తో గత కొంతకాలంగా శ్రుతి ప్రేమ వ్యవహారం నడుపుతోంది. వీరిద్దరిపై మీడియాలో రకరకాల కథనాలు కూడా వచ్చాయి. ఇద్దరికీ ఇది వరకే నిశ్చితార్థం జరిగిపోయిందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్పుకున్నారు. వీటిపై శ్రుతిహాసన్ క్లారిటీ ఇచ్చేసింది.
"మా నిశ్చితార్థం జరిగిపోయిందన్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటికి ఇద్దరం ప్రేమలో ఉన్నాం. మా బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి ఇంకా సమయం ఉంది. పెళ్లికి తనతో పాటు నేను కూడా తొందరపడడం లేదు. అందుకు ఇంకా టైమ్ ఉంది. ఈలోగా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి" అని చెప్పుకొచ్చింది. రెండేళ్ల పాటు సినిమాలు చేసేసి, ఆ తరవాత మైఖైల్ ని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని శ్రుతి భావిస్తోంది.