మెగాస్టార్‌ కోసం దిగి రానున్న నయన తార.!

మరిన్ని వార్తలు

సౌత్‌ క్వీన్‌ నయనతారకు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నయనతారతో వచ్చిన చిక్కల్లా ఒక్కటే. సినిమాకి డేట్స్‌ ఇస్తుంది కానీ, సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం అస్సలు రాదు. ఎంతటి స్టార్‌ హీరో సినిమా అయినా నయన్‌ది ఒకే తీరు. వెంకటేష్‌, బాలయ్య ఇలా ఎవరితో నటించినా ప్రమోషన్స్‌లో మాత్రం నయన్‌ దర్శనం వల్ల కాదు. కానీ ఈ సారి మాత్రం నయనతార ప్రమోషన్స్‌కి వస్తుందట. ఏ సినిమాకి అనుకుంటున్నారా.? 

 

నయనతార ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరుగున పడిపోయిన చరిత్రను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు 'సైరా'తో. ఇలాంటి గొప్ప చారిత్రక చిత్రంలో భాగం అవడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అందుకే బాలీవుడ్‌ సహా పలు భాషల నుండి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించేందుకు ముందుకొచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రం ప్రమోషన్స్‌ని ఇంకెంత గొప్పగా నిర్వహిస్తారో ఇప్పటికైతే ఊహించలేం. 

 

కానీ చాలా చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రమోషన్స్‌కి నయనతార కూడా హాజరు కానుందట. ఈ సినిమా నిర్మాత అయిన చరణ్‌ రిక్వెస్ట్‌ మేరకు నయన్‌తార 'సైరా' ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు ఒప్పుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఏది ఏమైతేనేం మొత్తానికి మెగాస్టార్‌ చిరంజీవి కోసం నయనతార దిగి రానుందన్నమాట. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS