కంగనా ఆటిట్యూడ్‌కి సలాం కొట్టి తీరాల్సిందే.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'మణికర్ణిక'. అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా, క్రిష్‌ జాగర్లమూడి, కంగనా సంయుక్తంగా దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా తన మనసులోని మాటల్ని కంగనా అభిమానులతో పంచుకుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. కానీ మళ్లీ మళ్లీ రావల్సిన సినిమాలివి. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమాలు. 

 

ఇంతవరకూ హీరోల మీదే భారీ బడ్జెట్స్‌ పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ హీరోయిన్స్‌ మీద కూడా భారీ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించాలి. అలా అని పెట్టిన బడ్జెట్‌ వృధా కాకూడదు. పెట్టిన బడ్జెట్‌ పెట్టినట్లుగా తిరిగొచ్చేలా కథా బలం ఉన్న సినిమాలు తెరకెక్కాలి.. అంటోంది కంగనా రనౌత్‌. బాలీవుడ్‌లో కంగనాకి నటిగా మంచి పేరుంది. ఆ స్టార్‌డమ్‌తోనే ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవిత గాధ అయిన 'మణికర్ణిక'ను అత్యంత భారీ బడ్జెట్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కించారు. 

 

ఈ సినిమా మొదట్నుంచీ వివాదాలతో సావాసం చేస్తూనే వస్తోంది. ఎలాగోలా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఓ పక్క ఝాన్సీరాణిని తప్పుగా చూపించారంటూ కర్ణిసేన ఆందోళనలు చేస్తూనే ఉంది. తప్పుపట్లే సన్నివేశాలేమీ ఈ సినిమాలో ఉండబోవని కంగనా చెప్పుకొస్తోంది. సెన్సార్‌ బోర్డ్‌ 'యు/ఏ' సర్టిఫికెట్‌ ఎందుకిస్తారనీ ఆమె ప్రశ్నిస్తోంది. ఝాన్సీ లక్ష్మీభాయ్‌ తనకేం చుట్టం కాదనీ, ఆమె భారతదేశానికి ముద్దుబిడ్డ. ఆమెను తప్పుగా చూపిస్తే, చరిత్రను వక్రీకరించినట్లే. అలా ఎప్పుడూ చేయబోమని కంగనా చెబుతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS